తెలంగాణాలో విద్యుత్ వినియోగం ఆల్ టైం రికార్డు స్థాయికి...

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నది. నిన్న శుక్రవారం నాటి ఉదయం ఏడు గంటల 35 నిమిషాలకు ఇది 10,601 మెగావాట్ల గరిష్ట స్థాయికి డిమాండ్ చేరినట్లు సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ 10,601 మెగావాట్లకు గాను 10,598 మెగావాట్లను పంపిణీ చేయగలిగారు. దీనితో గత జులై 31న నమోదైన 10,429 మెగావాట్ల విద్యుత్ వినియోగ రికార్డును అధిగమించినట్లయింది. నిన్నటి మొత్తం విద్యుత్ వినియోగం 224 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.

విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యుత్ వినియోగం అనూహ్య స్థాయిలో పెరిగింది. కేవలం తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే విద్యుత్ డిమాండ్ 2014లో ఉమ్మడి రాష్ట్రంకన్నా ఎక్కువ  స్థాయిలో నమోదవుతుంది. నిన్న ఆంధ్రపదేశ్  రాష్ట్రం 191 మిలియన్ యూనిట్లను వినియోగించుకుంది. కాగా రానున్న రోజులలో విద్యుత్ వినియోగం మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అమీర్ పేట- ఎల్బీ నగర్  మెట్రో ప్రారంభమవనుండటంతో పాటు వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా పెరగనుండటంతో మరిన్ని కొత్త రికార్డులు సృష్టించటం ఖాయమని భావిస్తున్నారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post