వాటి సామర్థ్యం అలాంటిది మరి.

వాటి సామర్థ్యం అలాంటిది మరి.
వాటి సామర్థ్యం అలాంటిది మరి.  
తెలుగు దేశం పార్టీ అనుకూల పత్రికలు మరియు న్యూస్ ఛానెళ్లు అన్నీ జగన్ కూ, బీజేపీకి ఎటువంటి పొత్తు లేకపోయినా వాటి మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేసాయి. కానీ తెలంగాణాలో ఎన్నికల కోలాహలం ఊపందుకోవడంతో ఇవన్నీ టిఆర్ఎస్ పై అదే వ్యూహాన్ని అమలు చేయటం ప్రారంభించాయి. 

చంద్రబాబు అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా, ఆయన వద్ధ అంతర్గతంగా చర్చలు జరిగినట్లు టిఆర్ఎస్, బీజేపీల మధ్య గల సంబంధం ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలను సృష్టించాయి. విశ్వసనీయత గల పత్రికలు లీకులకు, అనధికార వార్తలకు, ఊహాగానాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ ప్రోపగండాలో ఆరితేరిన అవి దీనిని తొలి పేజీలో అత్యంత ప్రాధాన్యం గల వార్తగా మార్చేసాయి. 

అసలు కెసిఆర్, బిజెపితో ఇప్పటివరకు పొత్తు పెట్టుకున్నదే లేదు. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకూ బిజెపి భాగస్వామి. గత ఎన్నికల సమయంలో బిజెపిని ఆకాశానికి ఎత్తి, స్వాతంత్య్రం తర్వాత దేశం లోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ పార్టీనే కారణంగా ఈ పత్రికలూ చానెళ్లు అభివర్ణించాయి. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కాంగ్రెస్ ను దేశానికి పట్టిన శని అని, సోనియా గాంధీని ఇటలీ మాఫియా అని అభివర్ణించారు. ఇప్పుడు అదే బాబు అవకాశవాద ధోరణితో కాంగ్రెస్ వైపు మొగ్గటంతో ఈ పత్రికలన్నీ దానికి అనుగుణంగా ప్రచారం మొదలు పెట్టేసాయి. 

ఈ పత్రికలు మరియు చానెళ్ల ప్రచారంలో ఇంకో గమనించదగ్గ అంశం ప్రత్యర్థిని వ్యక్తిగతంగా అపఖ్యాతి పాలు చేయటం. కెసిఆర్ గారు చేసిన ప్రసంగం మొత్తం వెతికి మరీ ఆయనను అపఖ్యాతి చేసే పదాన్ని హెడింగ్గా పెట్టడం ఈ పత్రికలకు తెలంగాణా ఉద్యమ కాలం నుండీ అలవాటు. ఆయనను ఆ సమయంలోనే సాధ్యమైనంత చెడ్డగా చూపించేవి. చాలా మంది ప్రజలకు 2009 తర్వాత వరకు ఆయన వాగ్ధాటి, మాస్ అప్పీల్ గురించి అవగాహన లేకుండా దాచగలిగాయి. అదే చంద్రబాబును సాధ్యమైనంత అద్భుతంగా, ఆయన ప్రసంగ హెడింగులను ఆకర్షణీయంగా చూపించేవి, ఇప్పటికీ చూపిస్తున్నాయి కూడా. 

ఈ పత్రికలు చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా దానిని సరైనదిగా అభివర్ణించగలవు. ప్రత్యర్ధులు ఎవరితో పొత్తు పెట్టుకోకపోయినా వారికి పొత్తును ఇవే సృష్టించి మరీ వారిని అపఖ్యాతి పాలు చేయగలవు. వాటి సామర్థ్యం అలాంటిది మరి. 

1/Post a Comment/Comments

  1. inka idi ilage konasagutundi mari, paat poste kaavochu, kaani relevent gaane undi mari

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post