నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం

RTC Bus Accident
జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన తెలంగాణ ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్దది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ నలుగురు చిన్నారులు, 32మంది మహిళలతో సహా  59 మంది మృతి చెందారు. మరో 43 మంది క్షతగాత్రులయ్యారు. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ కూడా మృతి చెందగా కండక్టర్ పరమేశ్వర్‌ పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో కొంతమంది కొండగట్టు దర్శనానికి వచ్చిన భక్తులు కాగా, మరికొంత మంది సాధారణ ప్రయాణికులు ఉన్నారు. 

ఈ ప్రమాదం ఎలా జరిగింది? 

మంగళవారం కావటంతో కొండగట్టు లోని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు, తిరిగి వెళ్ళటానికి బస్సు పరిమితికి మించి ఎక్కారు. కొండ పై నుండి దిగుతున్న బస్సు చివరి మలుపునకు చేరుకోగానే అక్కడ పెయింట్ వేయని స్పీడ్ బ్రేకర్ ను డ్రైవర్ గమనించలేకపోయారు. దానితో బస్సు భారీ కుదుపునకు గురి అయి కొంతమంది ప్రయాణికులు డ్రైవర్ పై పడ్డారు. అదే సమయంలో బస్సు బ్రేకులు కూడా ఫెయిల్ అయి అదుపు తప్పి పక్కన ఉన్న 30 అడుగుల లోతు లోయలో పడిపోయింది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ బస్సును మైలేజీ కోసం న్యూట్రల్ లో నడిపిస్తుండటంతోనే బ్రేకులు పని చేయలేదనే వాదనా వినిపిస్తుంది.  

అడుగడుగునా నిర్లక్ష్యం 

ఒక సినిమాలో చెప్పినట్లు నిర్లక్ష్యాలన్నీ కలిసి పెద్ద నిర్లక్ష్యంగా మారి భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది. మన వ్యవస్థలలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అలసత్వం ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో బస్సును తనిఖీ చేయటం, ఎన్ని కిలోమీటర్లు బస్సును నడపాలి?, ఎంతమందిని బస్సులో ఎక్కించుకోవాలి?, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మరీ ఆక్యుపెన్సీ, మైలేజీ పెంచే ప్రయత్నాలు లాంటి విషయాలలో తెలంగాణ ఆర్టీసీ నిర్లక్ష్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. 

బస్సుల జీవిత పరిమితి 12 లక్షల కిలోమీటర్లు కాగా, ప్రమాదం జరిగిన బస్సు అప్పటికే దాదాపు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించినా ఆర్టీసీ స్క్రాప్ చేయలేదు. బస్సు పరిమితి 50 మంది కాగా బస్సులో ఆ సమయంలో 100 మంది వరకు ఉన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్లపై ఆక్యుపెన్సీ పెంచాలనే ఒత్తిడి ఉండటంతో వారు డ్రైవర్, కండక్టర్లను ఆ మేరకు వత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం. ఇక మైలేజీ పెంచటం పై కూడా డ్రైవర్లపై విపరీతమైన ఒత్తిడి ఉండటంతో వారు పల్లం ఉన్నప్పుడు న్యూట్రల్ లో నడిపిస్తున్నారు. న్యూట్రల్ లో నడిపేటప్పుడు బ్రేకులు సరిగ్గా పని చేయవు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ ఎంతో అనుభవం ఉండి, ఉత్తమ డ్రైవర్ గా అవార్డు పొందిన వ్యక్తి. ఇక ఈ మార్గం ప్రమాదకమని, బస్సులు నడపకూడదని గతంలో ఆర్టీసీ నిర్ణయించింది. అయినా ఆక్యుపెన్సీ పెంచడం కోసం ఈ మధ్యే ఈ మార్గంలో బస్సులను పునరుద్ధరించారు. 

ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా ప్రమాణాలకనుగుణంగా జరగలేదు. నిబంధనల కన్నా ఎక్కువ వాలుతో రోడ్డు నిర్మాణం జరిగింది. కనీస రక్షణ గోడలు లేని సిమెంటు రోడ్లు, మలుపుల వద్ద హెచ్చరిక/సూచన బోర్డులు లేకపోవటం, పన్నెండు స్పీడు బ్రేకర్లు ఉన్నా ఒక్కదానికి కూడా రంగులు వేయకపోవడం లాంటివి ఆర్ అండ్ బి శాఖా వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. ఇక ఈ రోడ్డు నిర్వహణ గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 

ఇక రవాణా శాఖ విషయానికి వస్తే  ఆర్టీసీ వాహనాల ఫిట్ నెస్ ను సరిగ్గా తనిఖీ చేయకపోవటం, వాటిలో అనుమతికి మించి ప్రయాణికులు వెళుతున్నా కేసులు నమోదు చేయకపోవటం, చిన్న వాహనాలకు ఉద్దేశించిన మార్గంలో భారీ వాహనాలు వెలుతున్నా పట్టించుకోకపోవటం వంటి నిర్లక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఇక రెవిన్యూ శాఖ అధికారులు అయితే రోడ్డుపక్కన కాంట్రాక్టర్లు గుంతను తవ్వి మట్టిని తరలించి దానిని లోయగా మార్చినా పట్టించుకోకపోవటం కనిపిస్తుంది. 

ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రమాద స్థలాన్ని సందర్శించటం, దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేయటం, మృతులకు సంతాపం తెలిపి ఐదు లక్షల ఆర్థికసాయం ప్రకటించటం చేసారు. తరువాత ఇంతమంది నిర్లక్ష్యానికి బలి పశువుగా డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేసి అధికారులు, ప్రభుత్వం చేతులు దులుపుకున్నారు. విచారణ జరిపిస్తామని ప్రభుత్వం చెప్పినా ఇలాంటి ఎన్ని విచారణలు మూలాల్లోకి వెళ్లి పూర్తిస్థాయి విచారణ నివేదిక ఇచ్చాయి? ఒక వేళ వారు ఆ స్థాయి నివేదిక ఇచ్చినా వాటిని ప్రభుత్వాలు అమలుపరుస్తాయని సామాన్యులకు పెద్దగా నమ్మకాలు లేవు. మనకు మన వ్యవస్థలో వేళ్లూనుకున్న నిర్లక్ష్యంపైనే విశ్వాసం ఎక్కువ కదా! 

మరణించిన వారు 


0/Post a Comment/Comments

Previous Post Next Post