తెలంగాణా ఐటీ, పంచాయత్ రాజ్ శాఖా మంత్రి కెటిఆర్ ఓడిపోతామేమోనన్న భయంతోనే, కాంగ్రెస్ నాయకులపై ఇష్టంవచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారని టిపిసిసి ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. ఆయనది కాకొరఫియా ఫోబియా అనే మానసిక వ్యాధి అని, సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయించుకోవాలని కూడా సూచించారు.
నాలుగు సంవత్సరాలుగా అతను ప్రజలకు చేసింది శూన్యమని, వాస్తవంలో కాకుండా సోషల్ మీడియాలోనే కెటిఆర్ పనిచేస్తారని నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని, ఉత్తమ్ కుమార్ ను విమర్శించటం ద్వారా తన అసమర్థత కప్పిపుచ్చలేరని ఆయన అన్నారు.
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారని, 500 రోజుల తర్వాత కూడా పరిస్థితి మరింత దారుణంగా తయారయింది కానీ, ఏ మాత్రం మెరుగు పరచలేకపోయారు. అయినా కెటిఆర్ తన శాఖతో సంబంధం లేని విషయాలపై పనికిరాని చర్చలు ప్రారంభించాలని భావిస్తాడు. అని విమర్శించారు.
Post a Comment