డి శ్రీనివాస్ కుమారునిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

డి శ్రీనివాస్ కుమారునిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
నిజామాబాదులో టిఆర్ఎస్ పార్టీ ఎంపీ డి శ్రీనివాస్ కుమారుడు, సంజయ్ యాజమాన్యంలోని B.Sc. (నర్సింగ్)  కాలేజీ విద్యార్థినిలు, ఆయన తమను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. 

POW నేత సంధ్య ఆధ్వర్యంలో విద్యార్థినులు హోం మంత్రి నాయని నర్సింహారెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. గత డిసెంబరులో తరగతులు ఆరంభమైనప్పటి నుండి తన ప్రవర్తనతో, వ్యాఖ్యలతో బాధ పెడుతున్నట్లు వారు తెలిపారు. 

వారం క్రితం హాస్టల్ భవనంలో ఒక విద్యార్థిని జారిపడి, ఆమెకు గాయాలవగా, సహాయం చేసే నెపంతో ఆ విద్యార్థినిని, తోడుగా మరొక  విద్యార్థినిని తన ఇంటికి తీసుకెళ్లి తప్పుగా ప్రవర్తించాడని సంధ్య తెలిపారు. ప్రభుత్వం భయంతో ఉన్న విద్యార్థినులకు భరోసా కల్పించాలని, వారి డిగ్రీ చదువుకు భవిష్యత్తులో కూడా ఆటంకాలు రాకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేసారు. 

సంజయ్ పై నిర్భయ చట్టం కింద కేసు దాఖలు చేయాలని, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సంధ్య హోమ్ మంత్రిని కోరారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని నర్సింహారెడ్డి వారికి హామీ ఇచ్చారు. అయితే నిజామాబాద్ పట్టణంలో సంజయ్ పై ఈ తరహా రూమర్లు చాలా కాలం నుండి వినిపిస్తున్నా, ఫిర్యాదు చేసేందుకు విద్యార్థినులు ముందుకు రావటం మాత్రం ఇదే తొలిసారి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post