థియేటర్లు, మల్టీప్లెక్సులపై కేసులు


తెలంగాణా రాష్ట్రంలో ఆగష్టు ఒకటి నుండి థియేటర్లు మరియు మల్టీప్లెక్సుల్లో అధిక ధరలకు కళ్లెం వేయనున్నామని చెప్పిన తూనికలు, కొలతల శాఖ తదనుగుణంగా స్పందించింది. 

ఇప్పటి వరకు అందిన వార్తల ప్రకారం, నగరంలో 20 చోట్ల థియేటర్లు, ముల్టీప్లెక్సులపై ఈ శాఖ దాడులు నిర్వహించింది. వాటిలో 18 చోట్ల నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని గుర్తించి 54 కేసులు బుక్ చేసారు. దాడులు ఇవాళ కూడా కొనసాగనున్నాయని తెలిపారు. 

తూనికలు, కొలతల శాఖ, థియేటర్లు మరియు మల్టీప్లెక్సుల్లో అధిక ధరల విషయమై ఇప్పటికే వారిని హెచ్చరించి, వాటికి సంబంధించిన నియమ నిబంధనలను జారీ చేసారు. ఇలా ప్రత్యేక అవగాహన కూడా కల్పించినప్పటికీ యాజమాన్యాలు బేఖాతరు చేయటం విశేషం. 

0/Post a Comment/Comments