మరి సమస్యలన్నీ ఇప్పుడే తీర్చొచ్చుగా పవన్

మరి సమస్యలన్నీ ఇప్పుడే తీర్చొచ్చుగా పవన్
పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ తాను  సీఎం అయితేనే సమస్యలు తీరుస్తానని అంటున్నాడని విమర్శించారు. ప్రజల దయ ఉంటే 2019లో ఎన్నికల తర్వాత తాను ముఖ్యమంత్రిని అవుతానని పవన్ అన్నారు. త్వరలో మేనిఫెస్టో విడుదల చేయనున్నామని ఆయన తెలియచేసారు.

మేనిఫెస్టో అంటే ఏమిటి పవన్. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే అమలు పరిచే ప్రణాళిక. మేనిఫెస్టో విడుదల చేయటం అంటే మీరు కూడా గెలిచాక అవి చేస్తామని హామీ ఇస్తున్నారన్న మాట. జగన్ సీఎం అయితేనే సమస్యలు తీరుస్తాననటం తప్పు అయితే మీరు సీఎం అవటం ఎందుకు? మేనిఫెస్టో ఎందుకు? ఇప్పుడే సమస్యలన్నీ తీర్చేయ్యొచ్చుకదా. 

0/Post a Comment/Comments

Previous Post Next Post