అమెరికాలో ఒక ప్రబుద్ధుడు ఏకంగా విమానాన్నే దొంగిలించాడు. శుక్రవారం రాత్రి సియాటిల్ విమానాశ్రయం నుండి అలస్కా ఎయిర్ కు చెందిన బొంబార్డియర్ Q400 విమానం టేక్ ఆఫ్ అయింది. అయితే ఎగరడానికి కావలసిన ముందస్తు అనుమతులేవీ తీసుకోక పోవటంతో కలకలం చెలరేగింది. 9/11 ఘటన తర్వాత ఇటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటున్న భద్రతా దళాలు రెండు F-15 యుద్ధ విమానాలతో ఆ విమానాన్ని వెంబడించాయి.
అయితే బయలుదేరిన కొద్దీ సేపటికే కెట్రాన్ ఐలాండ్ సమీపంలో ఆ విమానం కూలిపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ఉగ్రవాద ఘటనగా దీనిని భావించినప్పటికీ అటువంటిది ఏమీ లేదని తేలింది. ఎయిర్ లైన్ సంస్థకు చెందిన 29 ఏళ్ల గ్రౌండ్ సర్వీస్ స్టాఫ్ లో ఒకరు ఈ విమానాన్ని ఎత్తుకెళ్లారని తేలింది. అయితే ఆత్మ హత్య కోసమే ఈ విమానాన్ని దొంగిలించాడా? మరే కారణం వల్లనయినా అది కూలి పోయిందా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Post a Comment