జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమై బిజెపి మాట తప్పిందని పవన్ అన్నారు. అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూ అని నేనంటే, పవన్‌కల్యాణ్‌ది అనుభవరాహిత్యం అని తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసిందని అన్నారు.
మళ్ళీ ఇప్పుడు టిడిపిని ప్రశ్నిస్తే బిజెపిని వెనకేసుకొస్తున్నారని మళ్ళీ వారే మాట్లాడుతున్నారని పవన్ అన్నారు. చంద్రబాబుది రోజుకో మాట అని, ఆయనకు మద్ధతు పలికితే ఒకలా, వ్యతిరేకిస్తే మరోలా వ్యవహరిస్తారని విమర్శించారు. వారికి మద్ధతు ఇచ్చినప్పుడు పవన్ కు దేశభక్తి ఎక్కువ, సమర్థుడు అని పొగిడారు. ఇప్పుడు వారు చేసిన అవినీతిని ప్రశ్నించగానే వారికి శత్రువులా కనిపిస్తున్నా. అని వ్యాఖ్యానించారు.
కొంత మంది యువకులు పవన్ సీఎం అని నినాదాలు చేయగా, నేను చంద్రబాబులా నన్ను మరోసారి సీఎం చేయండి. తర్వాత నా కుమారుడిని సీఎం చేయండి అని అడగనన్నారు. జగన్ అయితే తాను సీఎం అయితేనే సమస్యలు తీరుస్తానని అంటున్నాడని విమర్శించారు. ప్రజల దయ ఉంటే 2019లో ముఖ్యమంత్రిని అవుతానని పవన్ అన్నారు. అదే జరిగితే మా ఇంటి నుంచి ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడని ప్రజలు అనుకోవాలని అన్నారు.
త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామని పవన్ తెలిపారు. ఈ పర్యటనలో తానూ ఐదేళ్ల ప్రాయంలో నివసించిన ఇంటిని ఆయన సందర్శించారు.
Post a Comment