ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను చెరో పక్కన పెట్టుకుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. మోడీ కుట్రలో భాగస్వాములవుతున్న వారిని నిలదీయాలి. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లలో జరిగిన 5వ గ్రామదర్శిని సభలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలివి.
- గత ఎన్నికలలో మోడీ వెంట ఎవరున్నారు? జగన్ ఉన్నారా ? లేక చంద్రబాబా?
- నాలుగు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఎవరు? టిడిపినా? వైసీపీనా?
- నిలదీయాల్సింది ఎవరిని?
- బహిరంగంగా నాలుగు సంవత్సరాలు వారితో భాగస్వామిగా ఉండి ప్రోత్సహించిన మిమ్మల్ని వదిలి, మీరు చెప్పింది నమ్మి ఉందో లేదో తెలియని రహస్య భాగస్వామ్యాన్ని నిలదీయాలా?
చంద్రబాబుకు తనకు అవసరమైనంత మేరకు గతాన్ని మర్చిపోయినట్లు నటించగలరు. దాన్ని ఇతరులు కూడా మర్చిపోవాలనీ, ప్రశ్నించవద్దనీ ఆయన భావిస్తారు.
కేంద్ర పాలకులకు అయిదు కోట్ల ప్రజలంటే లెక్కలేదు. కేంద్రం నుండి వడ్డీతో సహా రాబడతాం.
ఇది కూడా అదే సభలో చంద్రబాబు చెప్పిన మాట. ఇలాంటి ప్రకటనలు చేసేముందు పార్లమెంట్లో కేంద్రం ఏం మాట్లాడుతుందో ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి ఒప్పుకున్నాడని, హోదా సాధ్యం కాదనీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ విస్పష్ట ప్రకటన చేసారు. పార్లమెంట్ ముందేమో తెలుగుదేశం ఎంపీలు నాటకాలు, వేషాలు వేస్తున్నారు. హోదా కావాలనుకున్నప్పుడు ప్యాకేజీకి ఎలా ఒప్పుకున్నారో మీకే తెలియాలి.
Post a Comment