ఇవాళ రాజ్యసభలో జరిగిన డిప్యూటీ చైర్మన్ ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ లు రెండూ ఆంధ్రప్రదేశ్ ను మోసం చేశాయని, ఆ రెండు పార్టీలలో దేనికీ ఓటు వేయరాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే, ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చి మరీ బిజెపి మోసం చేసిందని, అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ లో పాల్గొనడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అటు బిజెపితో కొంతకాలం, ఇటు కాంగ్రెస్ తో కొంతకాలం ఉంటూ,ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసిన రెండు పార్టీలతో చేరి రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని విమర్శించారు.
సరే ఆ రెండు పార్టీలు మోసం చేసాయని వదిలేసి, ప్రత్యేక హోదా ఎలా సాధించాలనుకుంటున్నారు? మీ పార్టీకి దానిని సాధించే ఒక వ్యూహం, విధానం ఉండాలిగా? అంటే బిజెపి, కాంగ్రెస్ వాటి మిత్ర పక్షాలు ఏవీ లేకుండానే ఒంటరిగా ప్రత్యేక హోదా వస్తుందనుకుంటున్నారా? లేక వచ్చే ఎన్నికలలో దేశవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేయనుందా? ఇవాళ మీరు ఎన్నికలను బహిష్కరించటం వలన ఎవరికి లాభం కలిగిందో ప్రజలకు తెలుసు. ఎంత బుకాయించినా ప్రాంతీయ పార్టీలు, ఎవరో ఒకరి పంచన చేరాల్సిందే!
Post a Comment