ఎన్డీయే అభ్యర్థి, జెడి (యు) పార్లమెంట్ సభ్యుడు హరివంశ్ గురువారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల బి.కె. హరిప్రసాద్ పై ఆయన 125 - 105 ఓట్ల తేడాతో గెలిచారు. జులై 1న పి.కె. కురియన్ పదవీ విరమణ చేసిన అనంతరం రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉండటంతో ఇవాళ రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది.
ఎంపీలు రమా ప్రసాద్ సింగ్, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు హరివంశ్ నామినేషన్ను ప్రతిపాదించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అరుణ్ జైట్లీ , ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ హరివంశ్ ను అభినందించారు. అవయవ మార్పిడి జరిగిన తర్వాత అరుణ్ జైట్లీ సభకు హాజరవటం ఇదే తొలిసారి.
ఈ ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ, జెడి (యు) అభ్యర్థికి మద్ధతు తెలుపగా, టిడిపి, కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపింది. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికను బహిష్కరించింది.
I congratulate Shri Harivansh Ji on being elected the Deputy Chairperson of the Rajya Sabha. An accomplished writer, journalist and active Parliamentarian, I am sure he will further enrich Parliamentary proceedings in his new role. My best wishes to him. https://t.co/Gkwua6sKpb— Narendra Modi (@narendramodi) 9 August 2018
Post a Comment