భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజపేయి (94), ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు. బీజేపీ అతివాద పార్టీ అయినప్పటికీ ఆయన సౌమ్యుడిగా, అందరికీ ఆమోదయోగ్యుడుగా పేరుపొందారు. ఆయన రాజ నీతిజ్ఞుడు మాత్రమే కాక మంచి వక్త, కవి, భావుకుడు కూడా. గత పది సంవత్సరాలుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆయన ఎవరినీ గుర్తు పట్టలేకపోవడం అభిమానులను బాధ పెట్టింది.
యువకుడిగా ఉన్న వాజపేయి ప్రసంగాన్ని విన్న ప్రధాని నెహ్రూ, ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని ఆనాడే అన్నారు. అద్వానీ తో కలిసి ఆయన పార్టీని ముందుకు నడిపించారు. 1984 లో రెండు సీట్లు వచ్చిన పార్టీని 1989 లో అధికారంలో భాగస్వామిని చేయగలిగారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు ఏమీ రాలేదు. ఆయన ప్రధానిగా ఉన్న కాలంలోనే జాతీయ రహదారుల విస్తరణ పథకం మొదలై ఆయనకు గొప్ప పేరు తెచ్చి పెట్టింది.
వాజపేయి మరణం పై ప్రముఖులందరూ విచారం వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది.
Post a Comment