కేంద్రం మోసం చేసినా అభివృద్ధి చేస్తున్నాం

కేంద్రం మోసం చేసినా అభివృద్ధి చేస్తున్నాం
ఎవరూ సహకరించక పోయినా, వ్యతిరేకించినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, శ్రీకాకుళంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో  ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 

జలవనరులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, నదుల అనుసంధానం జరుపుతామని ముఖ్యమంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు 57% పూర్తి అయింది. నిర్మాణంలో ఉన్న 56 ప్రాజెక్టుల్లో 29 చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు ప్రాజెక్టులకు 54వేల కోట్లు ఖర్చు పెట్టాం. కేంద్రం నమ్మించి మోసం చేసింది. అయినా దృఢ సంకల్పంతో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నాం. కోటి ఎకరాలలో ఉద్యాన పంటలను సాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. డెయిరీని అభివృద్ధి  చేస్తున్నాం. రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మారుస్తామని ఆయన అన్నారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాడుతాం. అప్పుడు ఇస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు కుంటిసాకులు చెప్పి మోసం చేస్తుంది. ముంబయి - దిల్లీ కారిడార్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ, విశాఖ- చెన్నై కారిడార్‌ను చిన్న చూపు చూస్తున్నారు. అయినా వారిని వదిలి పెట్టేది లేదు అనుకున్నది సాధిస్తానని చంద్రబాబు అన్నారు. 

అన్ని జిల్లాలకు, ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, అందుకే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాల వారీగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ముందు చూపుతో రాష్ట్రానికి ఒక విజన్ తయారు చేసామని, అందులో 2022కి 2029కి, 2050కి లక్ష్యాలను నిర్ధేశించామని, 2029 కల్లా రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన అన్నారు. 

పాలనలో 76% సంతృప్తి ఉంది. దానిని 100% తీసుకొస్తాం. అభివృద్ధిలో రెండు అంకెల్లో కొనసాగుతున్నాం. పుట్టక ముందు నుండే పిల్లలను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి అన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా కాపుల రిజర్వేషన్లు అమలు చేస్తాం. అంటూ కేంద్రం నుండి రాష్ట్రానికి ఇంకా రావలసిన వాటిని, రాష్ట్ర పథకాలను వివరించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post