ఎన్డీయే అభ్యర్థికే టిఆర్ఎస్ ఓటు

ఎన్డీయే అభ్యర్థికే టిఆర్ఎస్ ఓటు
రాజ్య సభ ఉపాధ్యక్ష్య ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిని బలపరచాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు నిర్ణయాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు. 

ఎన్డీయే తరపున జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ పోటీ చేస్తున్న విషయం విదితమే. జేడీయూ నేత బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌, తెలంగాణ సీఎం కెసిఆర్ కు ఫోన్ చేసి మద్దతును అభ్యర్థించారు. ఆ సమయంలో కెసిఆర్ పార్టీలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. 

నిన్న సాయంత్రం పార్టీ నేతలతోనూ, ఎంపీలతోనూ జరిపిన చర్చలో జేడీయూ అభ్యర్థికి మద్దతు నివ్వాలని నిర్ణయించారు. ఆయన ఎన్డీయే తరపున పోటీ చేస్తున్నప్పటికీ ప్రాంతీయ పార్టీకి చెందిన వ్యక్తి అని కెసిఆర్ అన్నారు. తనకు ప్రత్యేకంగా ఫోన్ చేసి మద్ధతు అడిగారని, అప్పట్లో నితీష్ కుమార్ తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇచ్చారని కెసిఆర్ ఎంపీలకు వివరించారు. పార్టీ నేతలు, ఎంపీలు కూడా ఎన్డీయేకు మద్ధతునివ్వడమే ప్రస్తుతానికి ప్రయోజనకరమని సూచించటంతో ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నామని, రాజ్యసభకు చెందిన ఎంపీలందరూ ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కెసిఆర్ సూచించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post