ఈ మధ్య మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న శివసేన, రాజ్యసభ ఉపాధ్యక్ష్య ఎన్నికలలో మాత్రం ఎన్డీయే అభ్యర్థికే మద్దతునివ్వనుంది. గత నెలలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా శివసేన ఓటింగ్ లో పాల్గొనక పోవటం, రాహుల్ గాంధీ శివసేన అధినేతతో ఫోన్లో సంభాషించారన్న వార్తలు వెలువడడంతో ఈ పార్టీ మద్దతుపై ఉత్కంఠ నెలకొంది.
మేము ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇస్తున్నాం అని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ బుధవారం రోజు ప్రకటించటంతో ఈ ఉత్కంఠకు తెరపడింది. రాజ్యసభ ఉపాధ్యక్ష్య ఎన్నికలలో ఎన్డీయే నుండి జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ బీకే హరిప్రసాద్ బరిలోకి దిగుతున్నారు. శివసేన నిర్ణయంతో ఎన్డీయే అభ్యర్థి గెలుపుకు మార్గం సుగమమైనట్లేనని భావిస్తున్నారు.
Post a Comment