కేసీఆర్ |
రాబోయే సాధారణ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
సెప్టెంబరులోనే వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించనున్నామని, సెప్టెంబరు 2వ తేదీన ఔటర్ పరిసర ప్రాంతంలో భారీ ఎత్తున ప్రగతి నివేదన సభ జరపనున్నామని ముఖ్యమంత్రి తెలియచేసారు. అభ్యర్థులను కేశవరావు సారథ్యంలోని స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేయనుందని కూడా తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ కు కట్టుబడి ఉన్నామని, ఇక్కడ నివసించే వారందరూ తెలంగాణ బిడ్డలేనని కెసిఆర్ అన్నారు.
Post a Comment