పవన్ ఆ వ్యాఖ్యలను మర్చిపోలేకపోతున్నారా?

పవన్ ఆ వ్యాఖ్యలను మర్చిపోలేకపోతున్నారా?
పవన్ కళ్యాణ్
సోమవారం రోజు జనసేన పోరాటయాత్రలో భాగంగా జనసేన అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ నిడదవోలులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించక పోవటం వలన ప్రజలు రైళ్లు ఎప్పుడు వస్తాయో చూసుకొని బయటకు రావాల్సిన దుస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. 

ఇక ప్రతిపక్ష నేత జగన్ విషయం ప్రస్తావిస్తూ, తన జీవితంలో రహస్యాలు లేవని, ప్రజా సమస్యలపై ఆయనను మాట్లాడమంటే, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. జగన్ ఒకసారి చేసిన విమర్శలను పవన్ ప్రతీ సభలో గుర్తుకు తెచ్చుకుని మరీ ప్రస్తావిస్తుండటం గమనార్హం. ఆ వ్యాఖ్యలు ఇంకా ఆయనను వెంటాడుతున్నాయేమో. తాను పొగరెక్కి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని, కర్మానుసారం జరిగిన దానిని అనుభవించానని పవన్ అన్నారు. తన వ్యక్తిగత జీవితం ఛిన్నాభిన్నమైందని ఏడ్చానని, ఏమీ చేయలేకపోయానని ఆయన వివరణ ఇచ్చారు. 

ఇక లోకేష్ గురించి మాట్లాడుతూ తన ముందు మంచివాడిలా నటిస్తూ వెనక నుండి తల్లిని తిట్టించాడని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకసారి సోషల్ మీడియా పోస్టులు చూస్తే మంచిది. జనసేన కార్యకర్తలుగా చెప్పుకునేవాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో,  అంత కన్నా దారుణమైన ఎటువంటి తిట్లు తిడుతున్నారో తెలిసేది. ఇప్పుడు పవన్ చెబుతున్న లాజిక్ ప్రకారం అవన్నీ పవన్ తిట్టించినట్లే అవుతాయి కదా? 

0/Post a Comment/Comments

Previous Post Next Post