రాహుల్ హైదరాబాద్‌కి వస్తే ఏంటి, ఎర్రగడ్డకు వస్తే మాకేంటీ?

రాహుల్ హైదరాబాద్‌కి వస్తే ఏంటి, ఎర్రగడ్డకు వస్తే మాకేంటీ?
రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా తమకేంటని టిఆర్ఎస్ పార్టీ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఆయన హైదరాబాద్  వస్తే ఏంటి, ఎర్రగడ్డకు వస్తే మాకేంటీ? అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ని అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని కూడా ఎంపీ అన్నారు. 

ఉస్మానియా యూనివర్సిటీ స్వతంత్య్ర సంస్థ, సభకు అనుమతి విషయంలో ఓయూ వీసీ అనుమతి ఇవ్వకుంటే టీఆర్‌ఎస్‌కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. అయినా తెలంగాణ ఉద్యమ కాలంలో పోలీసులతో విద్యార్థులను కొట్టించిన కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఏ మొఖం పెట్టుకుని ఓయూ కి వెళ్తున్నారని ఆయన అడిగారు.

0/Post a Comment/Comments