రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో జేడీయూ పార్టీ నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అభ్యర్థించినందున మద్దతిచ్చామని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీది అహంకార ధోరణి అని, వారు ఫోన్ చేసి మద్ధతు అడిగారా? ఇప్పుడు జేడీయూ కు మద్ధతు ఇవ్వటంపై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా టీఆర్‌ఎస్ పని చేస్తుందని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ చిన్న ప్రాంతీయ పార్టీ అని, అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందు మోకరిల్లిందని ఆయన విమర్శించారు.
Post a Comment