ఐకియా - సోషల్ మీడియా

ఐకియా - సోషల్ మీడియా
హైదరాబాద్ లో నిన్న ప్రారంభమైన ఐకియా స్టోర్ కు అనూహ్య స్పందన లభించింది. స్టోర్ ముందర జనాలు బారులు తీరారు. స్టోర్ కు వెళ్లే దారులలో కూడా కిక్కిరిసిన వాహనాలతో ట్రాఫిక్ జామ్ లు ఏర్పడ్డాయి. జనం ఎగబడి, బారికేడ్ల ను కూడా తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయటంతో తోపులాట జరిగి కొంత మంది గాయపడ్డారు. ఈ స్థాయి స్పందనను తాము ఊహించలేదని, వారాంతంలో మరింత ఎక్కువ మంది రావచ్చని తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలియచేసారు.  

ఐకియా స్టోర్ ప్రారంభం కావటానికి ముందే సోషల్ మీడియాలో ప్రచారం జరిపింది. కానీ ప్రచారం కన్నా ఎక్కువగా, స్టోర్ ప్రారంభం సందర్భంగా రాయితీలు, బహుమతులు ఇస్తున్నారంటూ కొన్ని వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించటంతో ప్రజలు ఊహించనంతగా తరలి వచ్చారు. వైరల్ మెస్సేజీలను స్వయంగా నియంత్రిస్తున్నామన్న సోషల్ మీడియా, ఏ మేరకు కట్టడి చేయగలుగుతుందో అన్న విషయాన్ని ఈ ఉదంతం తెలియ చేసింది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post