మహిళకు భర్తను మార్చిన కెసిఆర్ ప్రభుత్వం


అవును. కెసిఆర్ ప్రభుత్వం మహిళకు భర్తను మార్చింది. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగంగా కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన రెండు ప్రకటనలలో ఒకే మహిళను వేరు వేరు భర్తలతో చూపించారు. ఆ మహిళ రైతు భీమా పథకం ఒక ప్రకటనలో ఒక భర్తతో కనిపించగా, మరో ప్రకటనలో వేరే భర్తతో కనిపించింది. 

ఇక ఈ విషయంపై సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. విపరీతంగా ట్రెండ్ అవుతుంది. వారు బహుశా  మోడల్స్ ను ఉపయోగించి ఉండవచ్చు. కానీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించే పథకానికి, ఇంత భారీఎత్తున ప్రకటనలు ఇచ్చేముందు కనీసం ఒక సారి సరి చూసుకోకపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

ఇంతకు ముందు అన్నా క్యాంటీన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాంటి పొరపాటు చేసిన విషయం విదితమే. అది కింద లింక్ లో చూడవచ్చు.

అన్నా క్యాంటీన్ ప్రచారానికి రాజన్న క్యాంటీన్ ఫోటో

0/Post a Comment/Comments

Previous Post Next Post