రాజీనామాను ఆమోదించడం ఈ జన్మలో కుదరదు

అశుతోష్
అశుతోష్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు సన్నిహితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అశుతోష్, ఇవాళ ఉదయం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేసారు. 

అయితే అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందిస్తూ రాజీనామాను ఎలా ఆమోదిస్తామనుకున్నారు. ఈ జన్మలో అది కుదరదు అని ట్వీట్ చేసారు. పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా బాధాకరమని, వెనక్కి తీసుకోవాలని, ఒప్పిస్తామని ట్వీట్లు చేసారు. ఒకవేళ ఆయన రాజీనామాకే కట్టుబడితే అది ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టమని భావిస్తున్నారు.




0/Post a Comment/Comments

Previous Post Next Post