ఆదాయ వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానం

ఆదాయ వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానం
ఆదాయ వృద్ధిలో గత నాలుగేళ్లుగా తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందని, గోల్కొండ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ప్రసంగిస్తూ కెసిఆర్ అన్నారు. ఐదవసారి జండా ఎగరేయటం గర్వంగా ఉందని, సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్నీ పునరుజ్జీవం చెందుతున్నాయని కెసిఆర్ తెలిపారు. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే పెను చీకట్లు కమ్ముకుంటాయన్న భావనలను పటాపంచలు చేసాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ను అందిస్తున్నాం. త్వరలో తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారనుంది. ప్రజలే తనకు ప్రేరణ అని, బంగారు తెలంగాణాకు పునరంకింతం అవుదామని ముఖ్యమంత్రి అన్నారు. 

రాష్ట్ర ఏర్పాటు సమయంలో 'తెలంగాణ ఒక రాష్ట్రం గా మనుగడ సాగించలేదు. తెలంగాణ వాళ్లకు పరిపాలించటం రాదు.' అని అనేక మంది అవహేళన చేశారని, అటువంటి అనుమానాలన్నీ పటాపంచలు చేశామని కెసిఆర్ అన్నారు. రాష్ట్రాన్ని చీకట్లలో ముంచటానికి ప్రారంభంలో కుట్రలు జరిగాయి, ఇప్పుడు కూడా ప్రాజెక్టులను అడ్డుకోవటానికి కుట్రలు జరుగుతున్నాయి. అయినా వాటినన్నింటినీ ఎదుర్కొని నాలుగేళ్లలో ఏటా 17.12 శాతం ఆదాయ వృద్ధిరేటుతో అగ్ర స్థానంలో నిలిచామని ఆయన అన్నారు. 

పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా తెలంగాణ ప్రభుత్వం పరిణతితో వ్యవహరిస్తుందని మెచ్చుకున్నారు. మేము చిల్లర రాజకీయాలు చేయటానికి రాలేదు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని, గంభీరమైన దృక్పథంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగుతామని కెసిఆర్ అన్నారు. ఈ నాలుగేళ్ల కాలములో రైతులకు, సాగు-తాగు నీటికి, కులవృత్తులకు, సంక్షేమానికి, పరిశ్రమలకు మరియు పాలనా సంస్కరణలకు పెద్దపీట వేసామని వాటికి సంబందించిన పథకాలను ఏకరువు పెట్టారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post