మరీ ఇంత ద్వంద్వ విధానమా?

మరీ ఇంత ద్వంద్వ విధానమా?
మమ్మల్ని విమర్శిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావు.
జగన్ పవన్లు కేంద్రాన్ని ఎందుకు విమర్శించడం లేదు?

జగన్ ఇక్కడ విమర్శలతో అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నాడు.
కేంద్రంలో బిజెపిని నిలదీయండి, టెలి కాన్ఫరెన్సులో ముఖ్య మంత్రి దిశా నిర్దేశం. 

ఇవి ఇవాళ పత్రికలలో టిడిపి నేతల నోట జాలువారిన ఆణిముత్యాలు. 

రాష్ట్రంలో ప్రతిపక్షం మమ్మల్ని విమర్శించకూడదు. అలా విమర్శిస్తే అభివృద్ధి ఆగిపోతుంది. రాష్ట్రానికి కంపెనీలు రావు. ఇదీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశంలో తండ్రీ కొడుకుల ఉవాచ. 

ఎవరైనా ప్రతిపక్షం సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతుంది అంటారు కానీ, ప్రతిపక్షం సహకరించలేదు కాబట్టే అభివృద్ధి చేయలేకపోతున్నాం అనే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో బహుశా ఇది ఒక్కటే.

మేము కేంద్రాన్ని ఇప్పుడు విమర్శిస్తాం. మీరు కూడా విమర్శించాలి. అంటే ప్రతిపక్షాలు కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా అంటే తెలుగు దేశం పార్టీకి నచ్చేటట్లు వ్యవరించాలన్నమాట. ఇదే చంద్రబాబు కొన్ని నెలల ముందు వరకు కేంద్రంతో అధికారం పంచుకున్నప్పుడు కేంద్రాన్ని విమర్శిస్తే రాష్ట్రానికి సహకారం లభించదు అని కూడా అనడం గమనార్హం. 

0/Post a Comment/Comments

Previous Post Next Post