మంగళ గౌరీ వ్రతము

మంగళ గౌరీ వ్రతము
మంగళ గౌరీ వ్రతము
శ్రావణ మాసములో దక్షిణ భారత దేశములో ప్రముఖంగా జరుపుకునే వ్రతములలో ఒకటి మంగళ గౌరీ వ్రతము. ఈ వ్రతము శ్రావణ మాసములో వచ్చే ప్రతి మంగళవారం ఆచరిస్తారు. ఈ వ్రతములో భాగంగా స్త్రీలు గౌరీ దేవిని ఆరాధిస్తారు. 

సాధారణంగా కొత్తగా వివాహమైన స్త్రీలు ఐదు సంవత్సరముల పాటు ఈ వ్రతమును ఆచరించే సాంప్రదాయం ఉంది. ఈ వ్రతము వలన సంతోషకరమైన కుటుంబ జీవితం లభిస్తుందని, దీర్ఘ సుమంగళిగా జీవిస్తారని భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో వివాహం కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతమును జరుపుకుంటారు. 

మంగళ గౌరీ వ్రత విధానము 

మంగళ గౌరీ వ్రతమాచరించే స్త్రీలు ఉదయమే లేచి, శుచిగా స్నానం చేసి గౌరీ పూజా మండపాన్ని సిద్ధం చేసుకోవాలి. నేల నుండి కొద్దిగా ఎత్తులో ఈ మండపాన్ని సిద్ధం చేయాలి. చెక్కపై వస్త్రాన్ని  గానీ, అరటి ఆకును గానీ పరచి మండపాన్ని సిద్ధం చేస్తారు. గౌరీ దేవి ప్రతిమను గానీ, చిత్రపటాన్ని గానీ అందులో పెట్టాలి. అవి అందుబాటులో లేనివారు కలశాన్ని గౌరీ దేవిగా భావించి పూజించాలి. 

ముందుగా పసుపుగణపతిని పూజించి, ఆ తరువాత గౌరీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయాలి. తర్వాత వ్రతకథను చదివి అక్షంతలు నెత్తిన చల్లుకుని పూజను ముగించాలి. పూజకు ముందు తోరమును చేతికి కట్టుకోవటం, తరువాత కనీసం ముగ్గురికి వాయినమివ్వటం మరువకూడదు. సాధారణంగా ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలపాటు వరుసగా చేసి ముగిస్తారు. 

పూజలు మరియు వ్రతాల సమయంలో పసుపుపూసిన దారమును తొమ్మిది వరుసలుగా, తొమ్మిది ముడులు వేసి ఆకును గానీ, పువ్వునుగానీ కలిపి తోరమును తయారు చేస్తారు. దీనిని కట్టుకోవటం వ్రతం చేయటానికి మనం తీసుకున్న సంకల్పానికి నిదర్శనంగా భావించాలి.

పూర్తి పూజా విధానము కావలసిన వారు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 


0/Post a Comment/Comments

Previous Post Next Post