తెలంగాణ స్పీకర్ కు హైకోర్టు షోకాజ్‌ నోటీసులు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ 
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ లు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ లో హైకోర్టు స్పీకర్ మధుసూధనాచారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర డిజిపికి, నల్గొండ, మహబూబ్ నగర్ ఎస్పీలకు, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ సెక్రటరీలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. 

స్పీకర్ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయగా, వారు హైకోర్టును ఆశ్రయించి సభ్యత్వాలను పునరుద్ధరించాలని తీర్పును పొందారు. కానీ స్పీకర్ తీర్పును అమలు చేయకపోవటంతో వారు కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విషయమై పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నిన్న మాట్లాడుతూ, దీనిని కోర్టులు శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడంగా అభివర్ణించారు. స్పీకర్ ని ప్రశ్నించే హక్కు కోర్టుకు ఉండదని ఆయన అన్నారు. కోర్టు తరువాత వాయిదా ఈ నెల 28న ఉంది. కాగా కెసిఆర్ మాట్లాడిన తీరు ప్రకారం, బహుశా స్పీకర్ కోర్టు నోటీసులకు స్పందించకపోవచ్చు. సమస్య మరింత జఠిలమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post