సరూర్ నగర్లో రేవంత్ |
రేవంత్ ప్రసంగాల్లో ప్రాస, పంచ్ కనిపిస్తాయి. తెలంగాణాలో ఆకట్టుకునేలా సంభాషించగలిగే నేతలలో ఆయన ఒకరు. గత కొన్నేళ్లలో ఆయనకు రాజకీయంగా అననుకూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఓటుకు నోటు కేసుతో వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా మసకబారింది. అయినప్పటికీ మాటల చాతుర్యంతో ఛరిష్మా నిలుపుకోగలుగుతున్నారు. ఇవాళ సరూర్ నగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడాలని సభికులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం దీనికి నిదర్శనం. సభ ఎజెండాలో లేనప్పటికీ ఆయన ఇలా ప్రసంగించారు.
ఇవాళ సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే గండిపేట తెగి గల్లీల్లోకి వచ్చినట్లనిపిస్తుంది.
కేసీఆర్ ఇది చాలా..! ఇంకా కావాలా..!
ఇంకా కావాలంటే
సింగరేణిలో గర్జిస్తాం…
కాకతీయ కోటలో కదం తొక్కుతాం..
పరేడ్ గ్రౌండ్ లో వరదై పారుతాం.
కొందరు నేతలు కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసిందని అడుగుతున్నారని,
ఈ దేశంలో భాక్రా నంగల్ ప్రాజెక్టు, చంబల్ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్.
శత్రుదేశం పాకిస్తాన్ పై 1971 లో యుద్ధం చేసి గెలిపించింది కాంగ్రెస్.
ఆరు లక్షల గ్రామాలున్న దేశంలో మారుమూల తండాలు, గూడాలకు కరెంటు ఇచ్చింది కాంగ్రెస్.
శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, జూరాల, భీమా, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందునే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంకా కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతారా?
ఒక సన్నాసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని అమ్మనా, బొమ్మనా అని అంటడు. తెలంగాణలో రైతులు, విద్యార్థులు, మైనారిటీలు, కార్మికులు అందరూ కాంగ్రెస్ తోనే బాగుపడతారు. కండలు కరగనీ.... గుండెలు పగలనీ.... రక్తం ఏరులై పారనీ..పోరాటం చేద్దామనీ, కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు.
Post a Comment