తెలంగాణ పర్యాటక ప్యాకేజీకి మే నుండి బుకింగులు నిల్

తెలంగాణ పర్యాటక ప్యాకేజీకి మే నుండి బుకింగులు నిల్
తెలంగాణ పర్యాటక సంస్థ, తెలంగాణ రాష్ట్రం లోని 11 ఆలయాలను సందర్శించటానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఆలయ దర్శన టికెట్, వసతి, భోజన సౌకర్యంతో కూడిన ఈ ప్యాకేజీని గత ఏప్రిల్ నెలలో 120 మంది, మే నెలలో 70 మంది ఉపయోగించారు. కానీ, ఆ తర్వాత ఆశ్చర్యకరంగా గత మూడు నెలలుగా ఒక్క బుకింగ్ కూడా నమోదు కాలేదు. 

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన ప్యాకేజీలకు స్పందన అంతగా లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం లోని ప్రతి ప్రదేశం హైదరాబాద్ నుండి సొంత వాహనంలో, లేక అద్దె వాహనంలో వెళ్లి వచ్చేంత దగ్గరగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. వసతి గృహాలకు మాత్రం బుకింగ్ లు బాగానే ఉన్నాయి. ఇదే తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహించే తిరుపతి, షిర్డీ మరియు శ్రీశైలం ప్యాకేజీలకు భారీ స్పందన ఉంది. 

ఈ మధ్యనే బొగత జలపాతాన్ని అభివృద్ధి చేయటానికి పర్యాటక శాఖ నడుం బిగించింది. అక్కడికి ఒక ప్యాకేజీని ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవు. అక్కడికి కూడా పర్యాటకులు భారీగా సొంత వాహనాలలోనే తరలి వస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post