ఔరంగజేబ్ కు శౌర్య చక్ర

ఔరంగజేబ్ కు శౌర్య చక్ర
ఔరంగజేబ్ కు శౌర్య చక్ర 
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇరవై మందిని శౌర్య చక్ర తో గౌరవించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాబితాను రక్షణ శాఖ విడుదల చేసింది. దీనిలో ఇటీవలే కాశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన ఔరంగజేబ్, రాళ్లు విసిరే మూకపై కాల్పులు జరిపి వివాదాస్పదుడైన మేజర్ ఆదిత్య కుమార్ ఉన్నారు. 

44 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన రైఫిల్ మన్  ఔరంగజేబు జూన్ 14 న ఈద్ జరుపుకునేందుకు ఇంటికి వెళ్తుండగా తీవ్రవాదులు అతనిని అపహరించినాడు. కొన్ని గంటల తరువాత బుల్లెట్ల తో నిండిన అతని మృతదేహం పోలీసులకు లభించింది. 

మేజర్ ఆదిత్య నేతృత్వంలోని దాయం జనవరి 27న జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్లో రాళ్లు విసిరిన బృందంపై కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post