రాహుల్ పై కేటీఆర్ ట్వీట్ల వర్షం

రాహుల్ పై కేటీఆర్ ట్వీట్ల వర్షం
రాహుల్ ప్రసంగంపై కేటీఆర్ పదునైన ట్వీట్లతో విరుచుకపడ్డారు. అవినీతిపై మాట్లాడే ముందు, వేదిక పైన తన పక్కన ఎవరున్నారో ఒకసారి చూడాలని, వారిలో సగం మంది బెయిల్ పై ఉన్నవారేనని ఆయన అన్నారు. రాహుల్ కు ఏబిసి అంటే తెలుసా అంటూ ఏ అంటే ఆదర్శ్‌.. బీ అంటే బోఫోర్స్‌.. సీ అంటే కామన్‌వెల్త్‌గేమ్స్‌ అని కాంగ్రెస్ హయాంలోని స్కాములను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని అవహేళన చేసారు.

ఇందిరాగాంధీ నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన 369 మందికే రాహుల్ ఇప్పుడు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న విషయం తెలుసుకోవాలని మరో ట్వీట్లో పేర్కొన్నారు.

మూడో ట్వీట్లో మీడియా, భావ ప్రకటన స్వేచ్ఛపై రాహుల్‌ మాట్లాడటాన్ని కూడా  దేశంలో విధించిన ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ ఎద్దేవా చేసారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post