జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల మానిఫెస్టోకు సంబంధించిన టీజర్ ను విజన్ డాక్యుమెంట్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ డాక్యుమెంట్‌ను ప్రజాకర్షకంగానే రూపొందించారు. రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చేందుకు బాగానే కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ విజన్ డాక్యుమెంట్లో వివరాలు ఇలా ఉన్నాయి.
రేషన్ కు బదులుగా మహిళలకు నెలకు 2500-3500 రూపాయల వరకు నగదు బదిలీ, ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ విధానం రద్దు, కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు, అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు 5% పెంపు, ముస్లింల కోసం సచార్ కమిటీ సిఫారసుల అమలు, అగ్రవర్ణ పేదల కోసం కార్పొరేషన్లు, వసతి గృహాలు, మహిళా రిజర్వేషన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వృద్ధాశ్రమాలు ఇలా ప్రజాకర్షకంగా ఉన్నాయి. కాగా ఎస్సీల వర్గీకరణ అంశానికి సామరస్య పరిష్కారం అని అన్నారు కానీ అది ఏమిటో స్పష్టత నివ్వలేదు.
Post a Comment