తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై తనతో చర్చకు రావాలని మంత్రి హరీష్ రావును, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి సవాల్ చేసారు. నీళ్లు, నిజాలపై తనతో చర్చించాలని, తన వాదన తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన అన్నారు. నీళ్లను అడ్డుపెట్టుకుని కెసిఆర్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచుకుంటుందని ఆయన ఆరోపించారు.
మంగళవారం సీఎల్ఫీ కార్యాలయంలో రేవంత్ విలేఖరులతో మాట్లాడుతూ, తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని, గన్‌పార్కు అయినా, ప్రెస్‌క్లబ్ అయినా రెడీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 34 వేల కోట్ల అంచనాతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి, 11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, పేరు-డిజైన్లను మార్చి అంచనాలను మరిన్ని వేలకోట్లు పెంచిందన్నారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వనందుకు ఎస్సెల్బీసి పనులను ఆపివేయించారని తీవ్ర ఆరోపణలు చేసారు. రోజూ మామను స్వాతిముత్యమని, అల్లున్ని ఆణిముత్యమని ఒకరినొకరు పొగుడుకుంటున్నారని, కేసీఆర్ ప్రారంభించిన ఒక్క సాగునీటి ప్రాజెక్టయినా ఉందా అని రేవంత్ ప్రశ్నించారు.
Post a Comment