వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి బిజెపిని ఎదుర్కోవాలని పశ్చిమ బంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతాబెనర్జీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మూడు రోజుల ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమయంలో మమత సోనియాగాంధీ తో పాటు పలువురు విపక్ష నేతలతో సమావేశమయి, వారిని కోల్‌కతాలో నిర్వహించనున్న భారీ ర్యాలీకి ఆహ్వానించనున్నారు.
ఈ మధ్య కాలంలో మమత ఎప్పుడు ఢిల్లీ వచ్చినా సోనియాను కానీ, రాహుల్ ను కానీ కలిసే ప్రయత్నం చేయలేదు. ఈ సమావేశంతో వారి మధ్య భేదాభిప్రాయాలు సమసిపోగలవని భావిస్తున్నారు. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, సిపిఎంతో కలిసి మమతకు వ్యతిరేకంగా పోటీ చేసింది.
దేశంలో బిజెపి చేస్తున్న విభజన రాజకీయాలను సహించబోమని మమతా అన్నారు. ఆ పార్టీ ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ లలో కాస్త ప్రభావం చూపవచ్చు. కానీ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి ప్రాంతాలలో ఆ పార్టీ రాజకీయాలు చేయవని ఆమె అన్నారు. దేశం ఇప్పుడు మార్పును కోరుకుంటుంది. 2019లో ఆ మార్పు కనిపిస్తుంది అని మమత తెలిపారు. బీజేపీలో కూడా సుష్మా, రాజ్ నాథ్ లాంటి మంచివాళ్ళున్నారని మమత కొనియాడటం విశేషం.
Post a Comment