శ్రావణ పౌర్ణమి | రాఖీ పౌర్ణమి

రాఖీ పౌర్ణమి
శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమగా, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. ఈ రోజున బ్రాహ్మణులు మొదలైన ద్విజులు నదిలోనో, చెఱువులోనో, బావి వద్దనో స్నానాలను ఆచరిస్తారు. నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. అందుకే ఇది జంధ్యాల పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. కాగా కొత్తగా ఉపనయనం అయిన వారికి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉపాకర్మను జరిపిస్తారు. అయితే సామవేదులు ఈ ఉపాకర్మను వినాయక చవితి రోజు ఆచరిస్తారు.

శ్రావణ పూర్ణిమ రోజున రక్షాబంధనాన్ని ఆచరించడం వలన రక్షా పూర్ణిమగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ రక్షా బందనానికి సంబంధించిన గాథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది.

ఈ రక్షా బంధనంలో పూజా స్థలంలో రక్షను పెట్టి, పూజ చేసి పురోహితునితో కుడిచేతి మణికట్టుకు కట్టించుకోవాలి. ఈ రక్షను కట్టించుకోవటం వలన సంవత్సరమంతా దుష్ట భూత, ప్రేత, పిశాచాలు దరి చేరవు. ఇంకా రోగాలు, అశుభాల నుండి రక్షణను పొందవచ్చు. కాబట్టే ఇది రక్షా బంధనం అయింది.

అన్నా చెల్లెళ్ళ ఆప్యాయతకు నిదర్శనంగా నిలిచే రాఖీ కట్టే సాంప్రదాయం కారణంగా ఈ రోజు రాఖీ పౌర్ణమిగా ప్రసిద్ధమైంది.  ఈ రోజు ఉదయం తలంటుస్నానం చేసిన తర్వాత ఆడవారు వారి సోదరులకు రాఖీ కడతారు. ఈ రాఖీ కట్టడంలో పురుషులు స్త్రీలకు రక్షణగా ఉండాలనే పరమార్థం ఇమిడి ఉంది. 

Will Be Updated Soon.... with Complete Details

0/Post a Comment/Comments

Previous Post Next Post