వరలక్ష్మీ వ్రతం

వరలక్ష్మీ వ్రతం
శ్రావణ మాసములో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ శుక్రవారం రోజున వీలుకాని వారు, ఆ మాసములో ఏదో ఒక శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రత ఆచరణను గురించి శివుడు స్వయంగా పార్వతికి చెప్పినట్లు స్కంద, భవిష్యోత్తర పురాణాలు చెబుతున్నాయి.

వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ఉదయమే మంగళ స్నానం గావించి, నూతన వస్త్రాలను ధరించి, పూజకు నిర్ణయించుకున్న స్థలంలో కలశాన్ని పెట్టి, లక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలి. సాయంకాలం ముత్తైదువులను పిలిచి పేరంటం చేసి పూలు, పండ్లు తాంబూలంగా ఇవ్వాలి. ఈ వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాచరణ వలన లక్ష్మీదేవి కృప కలిగి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. 




Will Be Updated Soon.... 

0/Post a Comment/Comments

Previous Post Next Post