కెసిఆర్ |
రాహుల్ పరిపక్వతతో మసలుకోవాలని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని కెసిఆర్ సలహా ఇచ్చారు. ఆయన మాట్లాడింది అంతా తప్పని, ఎవరో రాసిచ్చింది చదవటం సరి కాదని ఆయన అన్నారు. కుటుంబ పాలన గురించి రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదమని, ఢిల్లీలో కుటుంబ పాలన కంటే ఇక్కడ చాలా బెటర్ అని కెసిఆర్ ఎద్దేవా చేసారు. డబుల్ బెడ్ రూము ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చాము గానీ, అందరికీ కట్టిస్తామని చెప్పలేదని కెసిఆర్ వివరణ ఇచ్చారు.
ఒకేసారి రుణమాఫీ సాధ్యం కాదని, అయితే తప్పకుండా చేసేవాళ్లమని కెసిఆర్ వివరించారు. కర్ణాటక ముఖ్యమంత్రి కూడా రుణమాఫీకి ముందు తనతో చర్చించారని అన్నారు. పంజాబ్ లో రెండులక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోనూ డ్వాక్రా రుణాల మాఫీ కోసం ఎన్నికల ముందు ఒత్తిడి చేశారని, అయినా తాను సాధ్యం కాదని ఒప్పుకోలేదని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ బోగస్ హామీలు ప్రకటించదని, అమలు చేసేవే ప్రకటిస్తామని కెసిఆర్ తెలిపారు.
Post a Comment