నిడదవోలు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ |
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నిడదవోలు బహిరంగ సభలో మాట్లాడుతూ, తండ్రిని ఆదర్శంగా తీసుకుని వెన్ను పోటు రాజకీయాలు చేయవద్దని రాష్ట్ర మంత్రి లోకేష్ కు సలహా ఇచ్చారు.
నా ముందు మంచివాడిలా నటిస్తూ వెనక నుండి నా తల్లిని తిట్టించాడు. కెన్నడీ చదువుకున్న స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో లోకేష్ చదువుకుని ఏం లాభమని పవన్ అన్నారు. ఎలాగూ వెన్నుపోటు రాజకీయాలు తమ కుటుంబానికి అలవాటని, ఎదురుగా కౌగిలించుకొని వెనుక నుంచి పొడుస్తామంటే, పడేవాళ్లు లేరు. దీనివల్ల ఎన్టీఆర్ చివరి క్షణాల్లో ఎంతో బాధ పడ్డారని పవన్ వ్యాఖ్యానించారు. కావాలంటే ఇలా తిట్టించాను తప్పా, ఒప్పా అని తన తల్లిని అడగాలని కూడా పవన్ సూచించారు.
నియోజక వర్గానికి నలభై కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తామనుకుంటే సరిపోదని, నిడదవోలులో రైల్వే బ్రిడ్జి కూడా నిర్మించలేకపోయారని, ఇక్కడా కనీస సౌకర్యాలు కూడా లేవని పవన్ విమర్శించారు.
Post a Comment