తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని భారీగా విస్తరించనున్నట్లు ఓరియంట్ గ్రూప్ ప్రకటించింది. కొత్తగా 2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, బిర్లా గ్రూప్ చైర్మన్ సీకే బిర్లాలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఓరియంట్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా 4 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 4 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పనితీరుతోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులొస్తున్నాయని, స్థానికులకే ఎక్కువ అవకాశం కల్పించాలని కోరినట్లు యాజమాన్యాన్ని కోరామని ఆయన అన్నారు.
Post a Comment