రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ వినాయకుని విగ్రహం ఖరీదు ఈ సారి భారీగా పెరిగింది. ముడి సరుకు ధరలు పెరగడంతోనే ఇంతలా పెరిగాయని నిర్వాహకులు తెలిపారు.
ప్రతి ఏటా 40 లక్షల వరకు అయ్యే విగ్రహం ఖర్చు, ఈ సారి 80 లక్షలకు చేరింది. దీని తయారీకి ముప్పై ఐదు టన్నుల ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇరవై రెండు టన్నుల స్టీల్ రాడ్స్, పదిహేను టన్నుల క్లే వాడుతున్నారు. అయితే ఇవన్నీ బయటి రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. తూత్తుకూడి నుంచి ప్లాస్టర్ ఆప్ పారిస్, ముంబై నుంచి క్లే, పశ్చిమగోదావరి నుంచి వెదురు తెప్పిస్తున్నారు.
Post a Comment