నేడు దేశవ్యాప్తంగా ప్రజా రవాణా బంద్

కేంద్రం ప్రవేశపెట్టనున్న మోటారు వాహనాల సవరణ బిల్లుకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ప్రజారవాణా సంస్థలు బంద్‌ పాటించనున్నాయి.

నేడు దేశవ్యాప్తంగా ప్రజా రవాణా బంద్
కేంద్రం ప్రవేశపెట్టనున్న మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లుకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ప్రజారవాణా సంస్థలు బంద్‌ పాటించనున్నాయి. ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం లాక్కోవటానికే తెస్తున్నారని, ప్రభుత్వ కార్మికులకు నష్టం కలుగుతుందని, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేలా ఉందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. 

వాహన రిపేర్లు కేవలం కంపెనీల సర్వీసు సెంటర్లలో మాత్రమే చేయాలనే నిబంధన ఉండటంతో, చాలామంది సొంతంగా ఉపాధి పొందే మెకానిక్లు పని కోల్పోనున్నారని వారు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బంద్ పూర్తి స్థాయిలో జరుగనుంది. 
Labels:

Post a Comment

నిజానికి వాహన రిపేర్లు కేవలం కంపెనీల సర్వీసు సెంటర్లలో మాత్రమే చేయాలనే నిబంధన చాలా మంచిదే. సాంకేతిక నైపుణ్యం లేకపోయినా అనుభవం మీద వాహనాలను బాగుచేసే వారు వైరింగ్ వగైరాల్లో చేసే పొరపాట్లవలన వాహనాల్లో హఠాత్తుగా మంటలు చెలరేగి ప్రమాదాలు జరుగుతున్నాయన్నది నిత్యం గమనిస్తూనే ఉన్నాం. ఇండ్లల్లో, షాపుల్లో, ఆఫీసుల్లోనూ ఎలక్ట్రికల్ పనులూ ఏసీలు వగైరాలు సర్వీసింగులూ కూడా అనుభవం పేరుతో చేసి పారేస్తున్న మహానుభావుల పుణ్యమా అని కదా చిత్రంగా షార్ట్ సర్క్యూట్ అవటాలూ ఆస్తినష్టాలూ కొండొకచో ప్రాణనష్టాలూ కలగుతున్నది?అలాగే అనుభవం మేస్త్రీలు ఇళ్ళ నిర్మాణంలో తెస్తున్న కష్తనష్టాలూ తక్కువవి కావు. అన్ని రంగాల్లోనూ సర్టిఫైడ్ కాని వాళ్ళను దూరంగా ఉంచే బిల్లులూ రావాలి, అవి కఠినంగానూ ఉండాలి. తప్పదు.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget