ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ

ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ
ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ అధ్యక్ష్యుడు రాహుల్ గాంధీ తలపెట్టిన సభకు వైస్ ఛాన్సలర్ అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాలతో అనుమతిని నిరాకరించినట్లు ఆయన తెలియచేసారు. గత కొన్ని రోజులుగా సభకు అనుమతిని పెండింగ్ లో ఉంచిన వీసీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. 

టిఆర్ఎస్ పార్టీ అనుకూల విద్యార్థి సంఘాలు ఎట్టి పరిస్థితిలోను సభకు అనుమతించరాదని కోరుతుండగా, ఇతర విద్యార్థి సంఘాలు మాత్రం అనుమతించాలని వాదిస్తున్నాయి. సభకు అనుమతి కోసం కొన్ని సంఘాలు  హైకోర్టును ఆశ్రయించనున్నాయి. 

ఈ నెల 13, 14 తేదీలలో రాహుల్ గాంధీ తెలంగాణాలో పర్యటించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఓయూలో సభ వలన రాజకీయంగా ఉపయోగం ఉంటుందని భావించి, నిర్వహించ తలపెట్టారు. సభకు అనుమతి నిరాకరించటంతో ఇప్పుడు వారు ప్రభుత్వంపై  విమర్శలు కురిపిస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post