దేశ తొలి ప్రధాని నెహ్రూ విషయమై చేసిన వ్యాఖ్యలకు టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా క్షమాపణలు చెప్పారు. బెంగళూరులో టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ "నా వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. నా వలన జరిగిన తప్పుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ వివాదాన్ని ఇంతటితో ముగించండి" అని అన్నారు.
భారత్, పాకిస్తాన్ల మధ్య ప్రస్తుతం ఉన్న స్థితి దురదృష్టకరమని, యూరోపియన్ యూనియన్ లో ఉండే దేశాల వలే సుహృద్భావంతో ఉండాలని ఆయన అభిలషించారు.
ఆగస్ట్ 8వ తేదీన గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మహాత్మా గాంధీ, జిన్నాకు ప్రధాన మంత్రి పదవిని ఇవ్వాలనుకున్నారు. కానీ నెహ్రూ తానూ స్వయంగా ప్రధాన మంత్రి కావాలనుకుని, జిన్నాను ప్రధాని కాకుండా అడ్డుకున్నారు. జిన్నా ప్రధాని అయి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదు. అని అనడంతో దుమారం చెలరేగింది.
Post a Comment