2016లో ఢిల్లీలో నమోదైన ఒక కేసులో నిందితుని కోసం పాతబస్తీలోని షాహీన్‌నగర్, పహడీషరీఫ్‌లో ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా షాహీన్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్, అతని కుమారుడు పందోమ్మిదేళ్ల అబ్దుల్ ఖధీర్‌లను విచారణ నిమిత్తం కార్యాలయానికి రావాలని నోటీసులు అందచేసారు. వారి ఇంట్లో జరిపిన సోదా సందర్భంగా అబ్దుల్ ఖధీర్ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లను అధికారులు తీసుకెళ్లారు.
ఈ ఎన్‌ఐఏ సోదాల సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నగరం ఉగ్రవాదులకు స్థావరంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా హైదరాబాద్‌లోనే వాటి మూలాలు ఉంటున్నాయని, ఉగ్రవాదుల సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా మజ్లిస్ తో దోస్తీ కారణంగా పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. అస్సాం తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు.
Post a Comment