డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి(94) ఇక లేరు. ఇవాళ సాయంత్రం 6.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. వృద్ధాప్యం, అనారోగ్యం తదితర సమస్యలతో కావేరి ఆసుపత్రిలో జులై 24వ తేదీ నుండి ఆయన చికిత్స పొందుతున్నారు. 

చెన్నై నగరంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు రాకుండా ముందస్తు భద్రత ఏర్పాటు చేసారు. ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులతో ఆసుపత్రి ప్రాంతం నిండిపోయింది. ఆయన నివాసానికి కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. 

డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత

0/Post a Comment/Comments