ఎప్పుడూ రాని మాట... ఇప్పుడు చంద్రబాబు నోటి వెంట

ఎప్పుడూ రాని మాట... ఇప్పుడు చంద్రబాబు నోటి వెంట
రాష్ట్రానికి 1500 రోజుల పాలనలో 511 అవార్డులొచ్చాయని, ఇది ఒక రికార్డు అని చంద్రబాబు అన్నారు. ఏ చిన్న విషయానికైనా క్రెడిటంతా తానే తీసుకునే ముఖ్యమంత్రి ఇది సమిష్టి కృషి ఫలితమని, ఇది అందరి విజయమని, నేను బృందంలో సభ్యుడిని మాత్రమేనని అన్నారు. క్షేత్ర స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకూ అందరూ సహకరించారని ఆయన కొనియాడారు. 

నిన్న మొన్నటి వరకూ గతంలో తొమ్మిది సంవత్సరాల పాలనలో తానే హైదరాబాద్ ను అభివృద్ధి చేసానని, ప్రపంచపటంలో పెట్టానని అనేవారు. ఎప్పుడూ విజయాన్ని సమిష్టి కృషికి గానీ, బృందానికిగానీ ఆపాదించిన దాఖలాల్లేవు.  ముఖ్యమంత్రిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుకు  కారణమేమిటో? 

నాలుగువందల సంవత్సరాల హైదరాబాద్ అభివృద్ధి అంతా తన తొమ్మిది సంవత్సరాల పాలన వల్లనే అని చెప్పే చంద్రబాబు, ఈ ఐదు సంవత్సరాలలో అక్కడి అభివృద్ధిలో కనీసం పది శాతం కూడా కనిపించకపోవటంతో, వైఫల్యాన్ని సమిష్టి కృషి క్రింద జమ చేయటానికి ఇప్పటినుండే సన్నద్ధం చేస్తున్నారా? లేక 2004 ఎన్నికలలో ప్రభుత్వ అధికారుల వ్యతిరేకత వల్లే ఓడిపోయానని భావిస్తున్న ముఖ్యమంత్రి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఏమో వేచి చూడవలసిందే. 

0/Post a Comment/Comments