ప్రధాని మాటలను రికార్డుల నుండి తొలగించటం ఇదే తొలిసారి


నిన్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుండి హరి ప్రసాద్ పోటీలో నిలబడ్డారు. విజయం సాధించిన తర్వాత రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ హరివంశ్‌ కు అభినందనలు తెలిపారు. ఒకే పదవి కోసం ఇద్దరు 'హరి'లు పోటీ పడ్డారని ఆయన అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను రెచ్చగొట్టే విధంగా ప్రధాని కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేసారు. దీనితో హరి ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 

తర్వాత ఈ విషయంపై హరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని సభా హుందాతనాన్ని దిగజార్చారని, ఆయన మాటలు ప్రధాన మంత్రి స్థాయికి తగవని అన్నారు. రాజ్యసభ కూడా ఆయన మాటలను సభ రికార్డుల నుండి తొలగించింది. దేశ ప్రధాన మంత్రి మాటలను పార్లమెంట్ రికార్డుల నుండి తొలగించటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. అత్యుత్సాహంతో మాట్లాడారో, విజయ గర్వంతో మాట్లాడారో గానీ, మోడీ మాత్రం దీనితో అపప్రథను మూటగట్టుకున్నట్లయింది. 

0/Post a Comment/Comments