గోద్రా అల్లర్ల సమయంలో మోడీ రాజీనామా కోసం పట్టుపట్టాను.

గోద్రా అల్లర్ల సమయంలో మోడీ రాజీనామా కోసం పట్టుపట్టాను.
ఏ నాయకుడైనా మాట మార్చినా, మాట తప్పినా ఆ విషయాన్ని మళ్ళీ ప్రస్తావించరు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆ విషయంపై ప్రసంగించగలరు. 

హజ్‌ యాత్రికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, 2002 గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని పట్టుబట్టానని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో‌ బిజెపి ఆటలు సాగనివ్వమని ఆయన అన్నారు. 

ఇప్పుడు మనందరం ఇదే చంద్రబాబు 2014 లో బిజెపితో పొత్తు పెట్టుకుని, వారికి ఓటు వేయమన్న విషయాన్ని మర్చిపోయి, అర్జెంటుగా 2002 గోద్రా అల్లర్లను గుర్తుతెచ్చుకోవాలన్న మాట. ఆ సమయంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు, పట్టుపట్టానని ఇప్పుడు చెప్పుకోవటమే తప్పించి, అప్పట్లో రాజీనామా అయితే చేయించలేకపోయాడు కదా.  

ఆయన తనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలను మర్చిపోయినట్లు నటించేయగలరు. అక్కడున్నవారిలో ఎవరైనా ప్రశ్నించారో, వారిని తీవ్ర స్థాయిలో గద్దించే అలవాటు కూడా ఆయనకు ఉంది.

హజ్ యాత్రికులపైన జిఎస్టి వేయటం దారుణమని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. జిఎస్టి బిల్లు ఆమోద సమయంలో టిడిపి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అన్న విషయం కూడా ఇక్కడ మర్చిపోవాలి మరి. 

ఈ మధ్య ముఖ్యమంత్రి గారికి అందరితో సన్మానాలు చేయించుకునే అలవాటు బాగా పెరిగిపోయింది. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులతో, కొన్ని కుల సంఘాలతో సన్మాన కార్యక్రమాలు అయిపోయాయి. ఇప్పుడు హజ్ యాత్రకు బయలుదేరే ముస్లిం సోదరులతో సన్మానం చేయించుకున్నారన్నమాట. సమైక్య ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా రోజూ ఇలాంటి సన్మానాలతోనే వార్తల్లో కనిపించేవారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post