మోడీ, కెసిఆర్ లు ఇద్దరూ రీడిజైన్ స్పెషలిస్టులు

మోడీ, కెసిఆర్ లు ఇద్దరూ రీడిజైన్ స్పెషలిస్టులు
ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్లు ఇద్దరూ రీడిజైన్ల స్పెషలిస్టులని రాహుల్ గాంధీ అన్నారు. అంబేద్కర్ పేరుతో ఉన్న ప్రాణహిత - చేవెళ్ల  ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం అని పేరు పెట్టి  ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని లక్ష కోట్ల రూపాయలకు పెంచారని ఆయన విమర్శించారు. టెండర్లు లేకుండా కాంట్రాక్టులు ఇచ్చారని, దీనికి పద్ధతంటూ లేకుండా పోయిందని అవినీతికి పాల్పడటానికే ఇలా చేసారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో ఉన్న దుమ్ముగూడెం ప్రాజెక్టును కూడా సీతా-రామ ప్రాజెక్టు పేరుతో రీడిజైన్ చేసారని తెలిపారు. 

కేంద్రంలో మోడీ కూడా రఫాలే యుద్ధ విమానాల కాంట్రాక్టు ను రీడిజైన్ ద్వారా అనిల్ అంబానీకి కట్టబెట్టి వేల కోట్ల లాభం పొందారని రాహుల్ ఆరోపించారు. డీల్లీలో మోడీ, ఇక్కడ కెసిఆర్ లు ఇద్దరూ రీడిజైన్ ల పేరుతో మోసాలు చేస్తున్నారని,  రీడిజైన్ అంటేనే అవినీతి అని ఆయన అన్నారు. పార్లమెంట్లో తాను మోడీని ఈ విషయమై ప్రశ్నిస్తే పక్కచూపులు చూడటం తప్ప సమాధానం ఇవ్వలేదని అన్నారు. 

ఇద్దరూ ఒకరి కొకరు మద్ధతు ఇచ్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. జిఎస్టీ మరియు నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడితే కెసిఆర్ చప్పట్లు కొట్టి ప్రోత్సహించారని, ఇద్దరూ మీడియాను అణిచివేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post