భృతితో మొబైల్ కొనుక్కొని జల్సాలు చేయకండి

భృతితో మొబైల్ కొనుక్కొని జల్సాలు చేయకండి
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి లోకేష్ మాట్లాడుతూ యువత నిరుద్యోగ భృతి డబ్బుతో మొబైల్ కొనుక్కుని, ఇంటిలో పడుకుని జల్సా చేయవద్దని అన్నారని ఒక మీడియాలో వార్తలు వచ్చాయి. అక్కడే కొందరు ఆ డబ్బుతో సింగపూర్ పర్యటన కూడా చేస్తామని ఎద్దేవా కూడా చేసారట. దీనిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రాలింగ్ మొదలైంది. 

నిరుద్యోగ భృతి డబ్బుతో ప్రైవేటు ఫ్లయిట్లో జల్సా చేస్తామని ఒకరు, ఫైవ్ స్టార్ హోటల్ లో లోనే ఉంటామని మరొకరు, ఇంత డబ్బును ఎలా ఖర్చు చేయాలో అర్థం కావటం లేదనీ.....ఏమైనా ఐడియాలుంటే లోకేష్ చెప్పాలని.... ఇలా చాలా కామెంట్లు వస్తున్నాయి. 

ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తామని నాలుగేళ్ల పాటు మోసం చేసారని, ఇప్పుడు ఉపాధి కల్పించకుండా వేయి రూపాయలు ముష్టిలా వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వేయి రూపాయలకు కూడా 35 ఏళ్ళు దాటకూడదు, స్థానికత నిర్దారణ అంటూ సవాలక్ష నిబంధనలు ఉన్నాయని, వృద్దులు వికలాంగుల జాబితాలో నిరుద్యోగులను కూడా కలిపేశారనే విమర్శలు వచ్చాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post